ఘనంగా మరీచి మహర్షి జయంతి
ఘనంగా మరీచి మహర్షి జయంతి
తిరుమల,2023 జూన్ 24: శ్రీ మరీచి మహర్షి జయంతి కార్యక్రమం శనివారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ అధ్యక్షులు శ్రీ దీవి రాఘవ దీక్షితులు మాట్లాడుతూ వైఖానస శాస్త్రానికి మూలపురుషుడైన శ్రీ విఖనస మహర్షి శిష్యుడైన శ్రీ మరీచి మహర్షి విమానార్చన కల్పం అనే గ్రంథాన్ని రచించారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆరాధన, విధి విధానాలకు ఈ గ్రంథం ఎంతో ప్రామాణికమైందన్నారు. ఈ గ్రంథంలో పేర్కొన్న విధంగానే శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవ జరుగుతోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, టీటీడీ ఆగమ సలహాదారు శ్రీ పి.సీతారామాచార్యులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు శ్రీ టి.బ్రహ్మాచార్యులు, శ్రీ మణిదీప్ కుమార్, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.