GRAND FINALE OF SRI GT TEPPOTSAVAM _ ఘనంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
Tirupati, 23 February 2024: The annual Teppotsavam (float festival) of Sri Govindaraja Swamy temple came to a ceremonious conclusion on Friday evening.
In the morning the utsava idols of swami and His consorts were rendered snapana thirumanjanam.
Later in the evening Sri Govindarajaswami and His consorts blessed devotees taking a float ride for seven rounds in the temple tank.
Tirumala pontiffs temple DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, Superintendent Sri Mohan Rao and devotees were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఘనంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2024 ఫిబ్రవరి 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా
శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.