ఘనంగా ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు
ఘనంగా ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు
తిరుపతి, జూన్ 30, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శ్రీ సుందరరాజస్వామి మూలర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.