GRAND CONCLUSION OF 617TH ANNIVERSARY CELEBRATIONS OF THALLAPAKA ANNAMACHARYA _ ఘనంగా ముగిసిన 617వ తాళ్లపాక అన్నమాచార్యులు వారి జయంతి వేడుకలు

Tirupati, 18 May 2025: The 617th birth anniversary celebrations of Saint Tallapaka Annamacharya concluded grandly on Sunday. At the Annamacharya Kalamandiram, a music concert and Harikatha were held.

At 9 AM, Sri K. Udayabhaskar and team from Tirupati presented Annamayya keertanas like “Appani Varaprasadi Annamayya” and “Adivo Alladivo Srihari Vasamu.” At 10.30 AM, retired Harikatha artist Smt. Jandhyala Krishna Kumari and her team narrated “The Life Story of Annamacharya” through Harikatha.

Earlier, at 8 AM, a grand Asthanam was held at Sri Kodanda Ramaswamy Temple, accompanied by a group rendition by Annamacharya Project artists.

In the evening, at 6 PM, a music concert was performed by Smt. K.V. Vishalakshmi and team, followed by Harikatha by Smt. G.N.K. Seethalakshmi and her group at 7 PM.

Annamacharya Project Coordinator Dr. C. Latha, assistants Sri P. Krishnamurthy, Smt. Kokila, and several devotees participated in the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఘనంగా ముగిసిన 617వ తాళ్లపాక అన్నమాచార్యులు వారి జయంతి వేడుకలు

తిరుపతి, 2025 మే 18: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 617వ జ‌యంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి . ఈ సందర్బంగా అన్నమాచార్య కళామందిరంలో సంగీత సభ, హరికథ జ‌రిగింది.

తిరుపతికి చెందిన శ్రీ కె.ఉదయభాస్కర్ బృందం ఉదయం 9 గం.లకు సంగీత సభలో “అప్పని వరప్రసాది అన్నమయ్య”, “అదివో అల్లదివో శ్రీహరి వాసము” కీర్తనలను ఆలపించారు. ఉ.10.30లకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత హరికథా భాగవతారిణి శ్రీమతి జంధ్యాల కృష్ణ కుమారి బృందం “తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత కథ”ను హరికథగా చెప్పారు.

అంతకుముందు ఉదయం 8:00 గంటలకు శ్రీ కోదండ రామస్వామి వారి ఆస్థానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టి గానం నిర్వహించారు.

సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు శ్రీమతి.కె.వి.విశాలక్ష్మీ బృందం సంగీత సభ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు శ్రీమతి జి.ఎన్.కె.సీతాలక్ష్మీ బృందం హరికథ గానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ సి.లత, అసిస్టెంట్ లు శ్రీ పి.కృష్ణమూర్తి, శ్రీమతి కోకిల, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.