PETOTSAVAM HELD _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

Tirupati, 13 February 2025: The Peta Utsavam of Sri Kodandarama Swamy in Tirupati was celebrated on Thursday.  

On the occasion of Maghapournami, it is customary to take the ceremonial idols of Kodandaramaswami along with Sri Seetha, Lakshmana Swamy in a procession to Kupuchandrapet village, located at around 8 km from Tirupati at 8.30 am.  

From 10 am to 11.30 am, Snapana Tirumanjanam was held in grandeur.  In this, milk, curd, honey, turmeric and sandalwood were anointed to the utsavarlu of Swami and Amma.

After that, Unjalseva was held from 4pm to 5 pm.  They leave from there at 5.30 pm and reach back to the temple at 9 pm.

This festival is held every year during the full moon of Maghamasam.  

Bhajans and kolatams were organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya projects.

HH Sri Sri Sri Pedda Jeyar Swami, Sri Sri Sri Chinna Jeyar Swamy of Tirumala, Temple Deputy EO Smt Nagaratna, AEO Sri Ravi, Superintendent Sri Muni Shankar, other officials and a large number of devotees participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 13: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్‌ శ్రీ ముని శంకర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.