TIRUMALA NAMBI UTSAVAM HELD _ ఘనంగా శ్రీ తిరుమ‌ల నంబి శాత్తుమొర‌

Tirupati, 30 Oct. 19: Tirumala Nambi Utsavam was held with religious fervour in Sri Govindaraja Swamy temple at Tirupati on Wednesday.

In the morning Snapanam was performed to deities while in the evening the Utsava deities of Sri Govindaraja Swamy alo g with Tirumala Nambi were taken on a celestial procession in mada streets.

HH Sri Tirumala Pedda Jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy, Spl Gr DyEO Smt Varalakshmi were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఘనంగా శ్రీ తిరుమ‌ల నంబి శాత్తుమొర‌

తిరుపతి, 2019 అక్టోబ‌రు 30: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ తిరుమ‌ల నంబి వారి శాత్తుమొర బుధ‌వారం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

బుధ‌వారం  ఉదయం 9.00 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వార్లు తిరుమ‌ల నంబి ఆల‌యానికి విచ్చేశారు. అనంత‌రం ఉద‌యం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, తిరుమ‌ల నంబివారి ఉత్స‌వ‌ర్ల‌కు వైభ‌వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 గంటలకు  శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామివారు, తిరుమ‌ల నంబివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం శ్రీ తిరుమ‌ల నంబి వారి సన్నిధిలో శాత్తుమొర, అవతార పురాణ పఠనం, ఆస్థానం చేపడతారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ర‌వికుమార్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.