120th JAYANTHI OF SRI SADHU SUBRAMANYA SHASTRY CELEBRATED _ ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 130వ జయంతి

Tirupati, 17 December 2019: TTD organised a grand celebration of 120th Birth anniversary of Sri Sadhu Subramanya Shastry in recognition of his yeomen service to TTD in translation and recording the inscriptions of Srivari temple and heralding the glory of Lord Venkateswara.

Devastanam Education Officer Dr Ramana Prasad and SVETA Director Dr. K Ramanjaneyulu Reddy paid floral tributes and garlanded the bronze statue of Sri Shastry in front of SVETA building in Tirupati on Tuesday.

Later Dr Reddy said that Sri Shastry who worked as Peshkar of Srivari Temple also functioned as an epigraphist and translated most of the copper plate inscriptions, which included 1167 edicts comprising the Annamacharya sankeertans.

Daughter of Sri Shastry Smt Girija Devi and his grandson who is Additional Sessions Judge of Amalapuram in East Godavari District participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 130వ జయంతి

తిరుపతి, 2019 డిసెంబరు 17: తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి 130వ జయంతిని  మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు.

తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి డిఈవో శ్రీ ర‌మ‌ణ ప్ర‌సాద్‌, శ్వేతా సంచాల‌కులు డా..కె.రామాంజులు రెడ్డి, ఇతర అధికారులు పుష్పాంజలి ఘటించారు.
 
అనంత‌రం  శ్వేతా సంచాల‌కులు మాట్లాడుతూ శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి 1167 రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారని వివరించారు.

ఈ సందర్భంగా శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రీ కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు, అమ‌లాపురం అడిషిన‌ల్ డిస్టిక్ట్ సెష‌న్స్‌ జడ్జి శ్రీ సిఎన్.మూర్తి  పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.