TTD CELEBRATES GRAND SADGURU SRI THYAGARAJA SWAMY ARADHANOTSAVAMS- PANCHARATNA BRUNDAGANAM MESMERISES _ ఘనంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం

Tirupati, 2 Feb. 21: The 174th Pushya Bahula Panchami  Aradhanotsavam of Sadguru Sri Thyagaraja Swamy was celebrated on Tuesday under the auspices of the SV  College of Music and Dance in Tirupati.

The Pacharatna Brunda Gaanam performed by the faculty of SV Music College and Nadaswara Pathashala, retired teachers, old students and music exponents of Temple city mesmerised the audience.

Earlier special pujas were performed to the panchaloha statue of Sri Thyagaraja Swamy, Sri Natarajaswami and portraits of Sri Sita Rama Lakshmana and Hanumanta.

The grand Pacharatna Brunda Ganam as part of celebrations spellbound the music lovers. The rendering of popular and famous sankeetans of the saint Sri Thyagaraja accompanied by instrumental music of violin, flute and mridangam also stole the show.

TTD Devasthanams Education wing DyEO Sri C Govindarajan, SV Music and Dance College Principal Dr S Jamunarani, SV Recording Project OSD Dr AV Sharma and other senior teachers, alumni students etc. Were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం

మైమరపించిన పంచరత్న కృతుల‌ బృందగానం

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 02:  తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 174వ ‘పుష్యబహుళ పంచమి’ ఆరాధనోత్సవం మంగ‌ళ‌‌వారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి పంచరత్నకృతుల బృందగానం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తిరుపతికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు ఈ బృంద‌గానం చేశారు.

ముందుగా ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని ఓపెన్ ఆడిటోరియంలో శ్రీ న‌ట‌రాజ‌స్వామి, శ్రీ త్యాగరాజస్వామివారి పంచలోహ విగ్రహాల‌కు, శ్రీసీతారామలక్ష్మణులు, హనుమంతుని చిత్ర‌ప‌టానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్వీ నాదస్వర పాఠశాల అధ్యాప‌కులు, విద్యార్థుల మంగ‌ళ‌వాయిద్యంతో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.

మైమరపించిన పంచరత్న కృతుల‌ బృందగానం

ఈ సంద‌ర్భంగా నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్నకృతుల బృందగానం సంగీతప్రియులను మంత్రమగ్ధులను చేసింది.

 ముందుగా నాట రాగం, ఆది తాళంలో ‘జగదానందకారక జయజానకీ ప్రాణనాయక…. కీర్త‌న‌తో ప్రారంభించారు. ఆ త‌రువాత వ‌రుస‌గా గౌళరాగం, ఆదితాళంలో ‘దుడుకుగల న న్నేదొర కొడుకు బ్రోచురా…’, ఆరభి రాగం, ఆదితాళంలో ‘సాధించెనే ఓ మనసా(సమయానికి తగు మాటలాడెనె)…’, వరాళి రాగం, ఆదితాళంలో ‌’కన కన రుచిరా – కనకవసన! నిన్ను…’, శ్రీ రాగం, ఆదితాళంలో ‘ఎందరో మహానుభావు – లందరికి వందనము…’ ఐదు పంచరత్న కృతుల‌ను రాగయుక్తంగా ఆలపించారు. గాత్ర సంగీత కళాకారులతో పాటు వీణ, వయోలిన్‌, వేణువు,  మృదంగం తదితర అన్ని వాయిద్యాల కళాకారులు బృందగానంలో అత్యద్భుతంగా సహకారం అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విద్యా విభాగం డెప్యూటీ ఈవో శ్రీ సి.గోవింద‌రాజ‌న్‌, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్‌.జ‌మునరాణి, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, కళాశాల అధ్యాపకులు శ్రీ ఎంవి.సింహాచ‌ల‌శాస్త్రి, శ్రీ వి.స‌త్య‌నారాయ‌ణ‌, తిరుప‌తి మృదంగం సుధాక‌ర్‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు ఇత‌ర సీనియ‌ర్ అధ్యాప‌కులు, కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.