PAVITROTSAVAM CONCLUDES AT CHANDRAGIRI RAMALAYAM _ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
Tirupati, 24 October 2024: The annual Pavitrotsavams at Chandragiri Sri Kodanda Rama Swamy temple concluded on Thursday.
After morning Kainkaryams, the programs of Dwarathorana, Dhwaja Kumbharadhana, Chatushtarchana, Murthy Homa, Shanti Homa, Maha Purnahuti, Pavitra Vitharana and Veda sattumora were conducted.
Thereafter the Snapana Tirumanjanam was performed to the utsava idols of Sri Sitarama Lakshmana sametha Hanumantha Swamy and Sri Sudarshan Chakratalwar.
Later Chakrasnanam was held in a grand manner for Chakratalwar.
In the evening Sri Kodandarama Swamy along with Sri Sita Lakshmana will ride on Tiruchi and bless the devotees.
Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Gnana Prakash, Temple Inspector Sri Muni Haribabu, other officials and a large number of devotees were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2024 అక్టోబరు 24: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.
ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 11 గంట వరకు ద్వారాతోరణ, ధ్వజకుంభారాధన, చతుష్టార్చన, మూర్తిహోమం, శాంతిహోమం, మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, వేదశాత్ మొర కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఉదయం 11 నుండి 11.45 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతస్వామివారు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చక్రతాళ్వార్‌కు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు తిరుచ్చిపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ముని హరిబాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.