SRIVARI TEMPLE CLOSED FOR LUNAR ECLIPSE _ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

Tirumala, 03 March 2026: TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary said that the Srivari Temple was closed at 9 AM on Tuesday owing to the lunar eclipse.

Speaking to the media after the closure of the temple doors, he stated that darshan was provided to all devotees present in the queue lines before closing the temple. 

He also said that during the temple closure period, the Annaprasadam Complex, food courts and laddu sale counters were also closed.

In this context, pulihora packets were made available to devotees at all locations. 

He further informed that devotees would be allowed into the queue lines after the temple purification rituals and Punyahavachanam are performed in the evening.

TTD CV&SO Sri Muralikrishna, Tirupati SP Sri Subbarayudu, Srivari Temple Dy EO Sri Lokanatham, and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి

తిరుమల, 2026 మార్చి 03: చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.

ఆలయ ద్వారాలు మూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేనట్లు చెప్పారు. ఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.