CANCELLATION OF VIP RECOMMENDATION LETTERS ON SEPTEMBER 7 FOLLOWING LUNAR ECLIPSE _ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు
Tirumala, 01 September 2025: Following the Lunar Eclipse as the Tirumala temple remains closed from 3.30 PM on September 7 until 3 AM on September 8, recommendation letters will not be accepted on September 7 for VIP Break darshan on September 8. Only the Protocol VIPs(self) alone are permitted for VIP break darshan.
Similarly, on September 7, the Darshan time for offline SRIVANI ticket holders has been rescheduled to 1 PM.
Further, in view of annual Brahmotsavams in Srivari temple, the Koil Alwar Tirumanjanam is scheduled for September 16.
As such no VIP recommendation letters will be accepted on September 15.
The devotees are requested to make note of these changes and plan their pilgrimage accordingly and co-operate with TTD.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు
తిరుమల, 2025 సెప్టెంబర్ 01: సెప్టెంబర్ 7వ తేదిన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3.30 గంటల నుండి 8వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం విదితమే.
ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖు దర్శనం కొరకు 7వ తేది వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు.
అదేవిధంగా 7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగింది.
కాగా సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15వ తేదిన వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
