DARBAR KRISHNA GRACES CHANDRAPRABHA _ చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

TIRUPATI, 16 NOVEMBER 2023: Sri Padmavathi Devi as Darbar Krishna graced Her devotees on Chandraprabha vahanam.

 

On the seventh day evening the vahana seva was observed with a chill thrill feel.

 

Both the Tirumala pontiffs, Chairman Sri Karunakara Reddy, JEO Sri Veerabrahmam, temple DyEO Sri Govindarajan and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

తిరుపతి, 2023 న‌వంబ‌రు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అరవింద కుమార్, జస్టిస్ విశ్వనాథ్, హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకటరమణ, టీటీడీ చైర్మన్
శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో శ్రీ‌ వీరబ్రహ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్ విజివో శ్రీ బాలిరెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

నవంబర్ 17న రథోత్సవం:

నవంబర్ 17వ తేదీ శుక్రవారం ఉదయం 8:40 గంటలకు ధనుర్ లగ్నంలో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరగనుంది

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.