PADMAVATI CHILLS AS DURBAR KRISHNA _ చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

TIRUPATI, 04 DECEMBER 2024: Sri Padmavati Devi in the Alankaram of Durbar Krishna blessed Her devotees on Chandraprabha Vahanam.

The very sight of Durbar Krishna on the celestial moon carrier provided a chill-thrill to the devotees.

Both the Tirumala pontiffs, EO Sri Syamala Rao, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were present.

The artforms like Mohiniyattam, Nasik Dolu, Thalam dance, Kadapa drums and many more were performed with 246 artists belonging to 12 teams who exhibited their skills and enthralled the audience braving continuous downpour.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

తిరుపతి, 2024 డిసెంబ‌రు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ జె. శ్యామల రావు, జెఈవో శ్రీ‌ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.