CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడి కటాక్షం
TIRUPATI, 04 MARCH 2025: The ongoing annual Brahmotsavam in Jubilee Hills temple witnessed Chandraprabha vahana seva on Tuesday evening.
The deity paraded circumambulating the temple and chilled on the divine moon carrier to bless the devotees.
TTD trust board member Sri Bhanuprakash Reddy, one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, AEO Sri Ramesh, archakas and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడి కటాక్షం
హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 04: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.