DARBAR KRISHNA CHILLS ON CHANDRAPRABHA _ చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి కటాక్షం

Tirupati, 23 June 2024: Sri Prasanna Venkateswara as Darbar Krishna gave a chill thrill to devotees with His gracious presence.

The ongoing annual Brahmotsavam at Appalayagunta on the seventh evening witnessed the mesmerizing deity on the moon carrier in the pleasant evening on Sunday.

DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి కటాక్షం

తిరుపతి, 2024 జూన్ 23: అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్ర‌ప్ర‌భ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నారు . ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈఓ శ్రీ రమేష్, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.