NAVANEETA KRISHNA ON CHANDRAPRABHA VAHANA SEVA _ చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వైభవం
TIRUPATI, 24 FEBRUARY 2025: The seventh evening of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram witnessed the processional deity of Sri Kalyana Venkateswara taking a pride ride on the cool and soothing Chandraprabha Vahanam.
Holding a pot filled with butter in one hand and a butterball in another hand, the Utsava deity appeared in the sitting posture on the Moon carrier on the pleasant evening of Monday.
Spl Gr DyEO Smt Varalakshmi, DyEE Sri Damodaram, AEO Sri Gopinath, Agama Advisor Sri Mohanarangacharyulu and other office staff, religious staff, a huge number of devotees, artistes were also present.
ELECTRICAL ILLUMINATION A CYNOSURE IN SKVST BTU
“ALANKARAPRIYA” ATTRACTS DEVOTEES
TIRUPATI, 24 FEBRUARY 2025: The annual brahmotsavams at Sri Kalyana Venkateswara Swamy temple were glorified with the unique electrical illumination carried out by the Engineering of TTD this year.
During the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram, different forms of deities were artistically designed in the LED lights which have been attracting devotees in large numbers.
Besides the Dasavatarams, Asta Lakshmi, Kati Varada Hastams, colorful forms of various other deities, the tallest electrical diorama of the “Alankarapriya” stood as a special attraction. The display of the different ornaments being adorned to Sri Venkateswara in the temple are clearly portrayed in the unique structure and the devotees are seen capturing the rich illumination works on their mobiles and pouring in appreciation.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వైభవం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 24: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది.
వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.