CHANDRAPRABHA VAHANA SEVA _ చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

Tirupati, 02 April 2025: The pleasant evening on Wednesday witnessed Sri Ramachandra Murty taking a chill ride on the celestial Moon Carrier.

The devotees had a chill thrill when they witnessed Surya Vamsaja on Chandraprabha Vahana giving a soothing experience.

Both the senior and junior Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

తిరుపతి, 2025 ఏప్రిల్ 02: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధ‌వారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.