DURBAR KRISHNA SHINES ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనం పై వెలిగిన దర్బార్ కృష్ణుడు
Tirumala, 10 October 2024: On Thursday evening, on the 7th day of the ongoing annual Brahmotsavam of Tirumala, Sri Mallappa Swamy graced the devotees by touring the four Mada streets of Tirumala in Durbar Krishna Alankaram on Chandraprabha Vahanam.
“Purushottama Praptiyagam” describes Chandra as one of the forms of Sri Maha Vishnu.
Chandra is known as Sasyakara(life giver for plants) and that is why Ankurarpanam is also done in the moonlight in the evening.
Devotees consider Swami darshan on the Chandraprabha Vahanam as a sign of good, peace and happiness.
Tirumala Sri Pedda Jeeyangar, Tirumala Sri Chinnajeeyangar, TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Gautami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar and other officials participated in this Vahana Seva.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభ వాహనం పై వెలిగిన దర్బార్ కృష్ణుడు
తిరుమల 2024 అక్టోబరు 10: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ మల్లప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించాడు.
“పురుషోత్తమ ప్రాప్తియాగం” చంద్రుడిని శ్రీ మహా విష్ణువు రూపుగా వర్ణిస్తుంది.
ఖగోళ శాస్త్రం చంద్రుని సమస్త జీవకోటికి సస్యకారునిగా పేర్కొంది.
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తనను తాను నక్షత్ర కూటమిలో చంద్రునిగా అభివర్ణిస్తాడు.
అందుకే అంకురార్పణం కూడా సాయంత్రం వేళ చంద్రకాంతిలోనే జరుగుతుంది.
చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం మంచికి, ప్రశాంతతకు, ఆనందానికి సంకేతంగా భక్తులు భావిస్తారు.
ఈ వాహన సేవలో తిరుమల శ్రీ పెద్ద జియ్యంగారు, తిరుమల శ్రీ చిన్నజియ్యం గారు, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీర బ్రహ్మం, సి వి ఎస్ ఓ శ్రీ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చేరి చేయబడింది