SPECTACULAR CULTURAL SHOW AT CHANDRAPRABHA VAHANA _ చంద్రప్రభ వాహనసేవలో కళాబృందాలు అద్భుత ప్రదర్శన
Tirumala, 10 October 2024: The pleasant evening on Thursday, the 7th day of ongoing Srivari Salakatla Brahmotsavam in Tirumala witnessed artistic troupes from different states giving soulful performances in front of Chandra Prabha Vahana.
Under the auspices of TTD Hindu Dharmic Projects, 16 art groups consisting 416 artistez from Andhra Pradesh, Telangana, Karnataka, Bihar, Punjab and Maharashtra have presented their dance and songs to entertain the devotees along the galleries of four Mada streets.
Bharatanatyam, Kuchipudi and folk dances by the students of TTD run Sri Venkateswara Sangeet Nritya Kalasala enthralled the spectators.
Bihari folk dance performed by Umashankar troupe from Bihar, Chandrakala dance performed by Rupashree troupe from Karnataka state, percussion instruments performed by Nagalakshmi troupe from East Godavari district, Punjab state Luddi, a folk dance of the state, performed by Bhavin Rathode troupe impressed the devotees.
Yakshaganam performed by the Gouri group of Karnataka, Chakka bhajans performed by Rajeswara Rao group from Vijayawada, Keiluguram performed by Subrahmanyam group from Palamaneru were some other cynosures.
Kolatam by Srinivasulu team, Ramaavataram Rupakam by Dr. Murali Krishna Troupe from Tirupati went on gracefully.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చంద్రప్రభ వాహనసేవలో కళాబృందాలు అద్భుత ప్రదర్శన
తిరుమల, 2024 అక్టోబరు 10: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన గురువారం రాత్రి చంద్రప్రభ వాహనసేవలో వివిధ రాష్ట్రల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్నాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో 16 కళా బృందాలు, 416మంది కళాకారులు పాల్గొని తమ తమ కళాకృతులతో స్వామి వారిని ఆట పాటలతో సేవించున్నారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి,జానపద నృత్యాలు ఆహుతులను కట్టిపడేశాయి. బీహార్ కు చెందిన ఉమాశంకర్ బృందం ప్రదర్శించిన బీహారీ జానపద నృత్యం, కర్నాటక రాష్ట్రానికి చెందిన రూపశ్రీ బృందం ప్రదర్శించిన చంద్రకళా నృత్యం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగలక్ష్మి బృందం ప్రదర్శించిన మహారాష్ట్ర తాళవాయిద్యాలు, పంజాబ్ రాష్ట్రానికి చెందిన భవీంద్రథోడ్ బృందం ప్రదర్శించిన లుడ్డీ అనే ఆ రాష్ట్ర జానపద నృత్యం భక్తులను ఆకట్టుకున్నాయి.
కర్నాటకకు చెందిన గౌరీ బృందం ప్రదర్శించిన యక్షగానం, విజయవాడకు చెందిన, రాజేశ్వరరావు బృందం ప్రదర్శించిన చెక్క భజనలు పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన కీలుగుఱ్ఱం, విశాఖపట్నంకు చెందిన పి.శ్రీదేవి బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు రూపకం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎ.పాపారావు బృందం ప్రదర్శించిన డప్పు విన్యాసాలు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి.సుమన్ బృందం, హైదరాబాదుకు చెందిన ఎస్.రాజేశ్వరి బృందం, తిరుమలకు చెందిన డి. శ్రీనివాసులు కోలాట బృందాల ప్రదర్శనలు తిరుపతికి చెందిన డాక్టర్ మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన రామావతారం రూపకం నయన మనోహరంగా సాగింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.