ASTABANDHANAM TO CONCLUDE ON OCT 25 _ చంద్ర‌గిరి శ్రీ కోదండ‌రామాల‌యంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

Chandragiri, 24 Oct. 19: Astabandhana Balalaya Maha Samprokshanam will conclude Chandragiri Kodanda Ramalayam on October 25.

The rituals like Kalakarshana will be observed between 9am and 11am in the temple. 

In the evening Jaladhivasam and Sayanadhivasam will be observed. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్ర‌గిరి శ్రీ కోదండ‌రామాల‌యంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
 
 తిరుప‌తి, 2019 అక్టోబ‌రు 24: చంద్ర‌గిరి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ పాంచరాత్ర ఆగమోక్తంగా కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. అక్టోబ‌రు 25వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం,  వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

కళాకర్షణ :

ఉద‌యం 9.00 నుండి 11.00 గంటల వరకు కళాకర్షణలో భాగంగా దివ్య విమానం, గర్భాలయంలోని సీతా ల‌క్ష్మ‌ణ హ‌నుమంత  స‌మేత శ్రీ రాముల‌వారు, శ్రీ గోదాదేవి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ స‌న్నిది ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ వీరాంజ‌నేయ‌స్వామి, ధ్వ‌జ‌స్తంభం, బ‌లిపీఠం త‌దిత‌ర  దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేశారు. ఈ కుంభాలతోపాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ట, యాగశాలలో నిర్వహించారు.

సాయంత్రం 5.00 గంట‌ల నుండి శ‌యాధివాసం, జ‌ళాధివాసం, ఛాయా స్న‌ప‌నం త‌దిత‌ర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో  టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మ‌ణికంఠ బ‌ట్ట‌ర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ప్రధాన కంక‌ణ‌బ‌ట్ట‌ర్‌ శ్రీ కృష్ణ‌బ‌ట్ట‌ర్‌, సూపరింటెండెంట్‌ శ్రీ కృష్ణారావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.