NAVANEETA KRISHNA CHILLS ON CHANDRA PRABHA VAHANAM _ చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై వెన్న కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

Tirupati, 26 Feb. 22Sri Kalyana Venkateswara in Navaneeta Krishna Alankara blessed devotees on Chandra Prabha Vahanam in Ekantam.

DLO Sri Reddeppa Reddy, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై వెన్న కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 26: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం రాత్రి స్వామివారు వెన్న కృష్ణుడి అలంకారంలో చంద్ర‌ప్రభ వాహనంపై కటాక్షించారు.

మాన‌సిక‌శాంతి ప్రాప్తి :

నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాల్లా పొంగి ఆనందిస్తాయి.

వాహ‌న‌సేవ‌లో డిఎల్ వో శ్రీ రెడ్డప్ప రెడ్డి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయ‌లు, శ్రీ రమణయ్య, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.