CHAKRASNANAM OF NARAYANAVANAM TEMPLE _ చక్రస్నానంతో ముగిసిన నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 31 May 2021: The annual Brahmotsavams of Sri Kalyana Venkateshwara temple at Narayanavanam came to a finale on Monday morning with the Chakrasnanam fete held in Ekantam due to Covid guidelines.
Earlier in the morning, the Snapana Tirumanjanam event to utsava idols of Sri Kalyana Venkateshwara Swamy and His consorts were performed at the temple Mandapam.
Thereafter Chakrasnanam was conducted in a big vessel accompanied by Mangala Vaidyam and Veda mantras.
Later in the evening, TTD organised the Dwajavarohanam heralding the finale of the annual fete.
Temple special grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Satre Nayak, temple inspector Sri Nagaraj, Archakas and other staffs were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చక్రస్నానంతో ముగిసిన నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2021 మే 31: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు.
ఉదయం 9.30 నుండి 10.30 గటంల వరకు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.
కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ సత్రేనాయక్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.