REVIEW ON CHAKRA SNANAM ARRANGEMENTS _ చ‌క్ర‌స్నానానికి ఏర్పాట్లపై సమీక్ష

 – SANCTITY OF WATER LASTS THROUGHOUT THE DAY AT PUSHKARINI

 – DEVOTEES SHALL TAKE BATH IN A PHASED MANNER WITH PATIENCE

 – TTD ADDITIONAL EO

Tirumala, 10 October 2024: The Additional EO Sri Ch Venkaiah Chowdary conducted a review with the officials at  Annamaiah Bhavan in Tirumala on Thursday evening on the arrangements for Chakra Snanam which is on October 12, the last day of Srivari Salakatla Brahmotsavam. 

Speaking on this occasion, the Additional EO said that on that day the rituals lasts from 6 am to 9am at Swamy which includes  Snapana Tirumanjanam to Sri Malayappa Swamy,  Sridevi, Bhudevi along with 

Sri Sudarshana Chakratathalwar followed by Chakra Snanam.

For this, the galleries and bathrooms be arranged in Pushkarini so that the devotees would not face any difficulties, he directed the officials concerned.  

The  officers were directed to make available the TTD security personnel as well as the SDRF, NDRF, SPF and swimmers to ensure safety of pilgrims.

Appeal to devotees 

Devotees are appealed to exercise restraint and bathe in Pushkarini, as the sacredness of Chakra Snanam will remain throughout the day.  

Necessary arrangements have been made for the devotees to change their clothes.

JEOs Smt Gautami, Sri Veerabraham, CVSO Sri Sridhar, Sri. Satyanarayana and senior officials participated in this meeting.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చ‌క్ర‌స్నానానికి ఏర్పాట్లపై సమీక్ష

•⁠ ⁠పుష్క‌రిణిలో రోజంతా ప‌విత్ర‌త

•⁠ ⁠భ‌క్తులు సంయ‌మ‌నంతో స్నానం చేయాలి

•⁠ ⁠టీటీడీ అదనపు ఈవో

తిరుమల, 2024 అక్టోబరు 10: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన అక్టోబరు 12న చ‌క్ర‌స్నాన ఏర్పాట్లపై అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల స్వామి పుష్క‌రిణిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ఆ త‌రువాత చ‌క్ర‌స్నానం నిర్వహిస్తారన్నారు.

ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, స్నానఘట్టాలు పై సమీక్షించారు. భ‌ద్ర‌తాప‌రంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బందితోపాటు ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్ డఆర్ఎఫ్, గజ ఈత‌గాళ్ల‌ను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భక్తులకు విజ్ఞప్తి

చక్రస్నానం ప‌విత్ర‌త రోజంతా ఉంటుంద‌ని, భ‌క్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాల‌ని ఆయన కోరారు. భ‌క్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

ఈ స‌మావేశంలో జె ఈ ఓ లు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్ ఓ శ్రీ శ్రీధర్ సిఇ శ్రీ సత్యనారాయణ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.