KALYANA VENKATESWARA RIDES CHINNA SESHA _ చిన్నశేషవాహనంపై శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
TIRUPATI, 19 FEBRUARY 2025: Sri Kalyana Venkateswara Swamy took out a celestial ride on Chinna Sesha Vahanam on the second day of the ongoing annual Brahmotsavam at Srinivasa Mangapuram on Wednesday.
Considered as an incarnation of serpent king Vasuki, Chinna Sesha Vahanam appears with five hoods carrying Sri Kalyana Venkateswara.
Special Grade DyEO Smt Varalakshmi and other temple, religious staff, devotees, devotional dance troupes were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నశేషవాహనంపై శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది