MURALI KRISHNA BLESSES DEVOTEES _ చిన్నశేష వాహనంపై మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
TIRUPATI, 28 NOVEMBER 2024: On the first evening of the ongoing annual brahmotsavams at Tiruchanoor on Thursday, Sri Padmavati Devi as Murali Krishna blessed devotees on Chinna Sesha Vahanam.
HH Sri Chinna Jeeyar Swamy, JEOs Smt Goutami, Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నశేష వాహనంపై మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
తిరుపతి, 2024 నవంబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు.
మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామల రావు దంపతులు, జెఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, శ్రీ సుభాష్, ఏవీఎస్వో సతీష్ కుమార్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.