CHINNA SESHA VAHANA SEVA HELD _ చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 2024 అక్టోబ‌రు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

TIRUMALA, 05 OCTOBER 2024: The procession of Chinna Sesha Vahanam held in an elegant way on the second day of the ongoing annual Brahmotsavam at Tirumala on Saturday morning which provided a feast to the eyes of thousands of devotees who had congregated around the thoroughfares of the temple town.

The processional deity of Sri Malayappa Swamy, donning the role of Sri Krishna, was taken for a pleasure ride on the five- hooded golden Chinna Sesha vahanam in all His majestic display of power and strength.

It is widely believed that a divine glimpse of Sri Malayappa on Chinna Sesha Vahanam, the Serpent King Vasuki, enlightens the devout about the importance of the hidden Kundalini energy within themselves and enables them to attain salvation.

Both the Tirumala Pontiffs, and other officers were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI