CHINNA SESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

Tirupati, 18 June 2024: On the second day of the annual Brahmotsavam at Appalayagunta, Sri Prasanna Venkateswara took a celestial ride on Chinna Sesha Vahanam.
 
In Mohana Krishna Alankaram, Sri Prasanna Venkateswara blessed his devotees on the divine serpent carrier.
 
AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2024 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంట‌లకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో ఆల‌య ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.