VENNEMUDDA KRISHNA ON CHINNA SESHA _ చిన్నశేష వాహనంపై వెన్నముద్దకృష్ణుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
TIRUPATI, 10 NOVEMBER 2023: Sri Padmavathi Devi as Vennemudda Krishna holding butterball in Her hand in the guise of Lord Krishna amused devotees.
The first day of the on going annual brahmotsavam in Tiruchanoor witnessed Chinna Sesha Vahana seva on Friday evening.
Both the Pontiffs of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
చిన్నశేష వాహనంపై వెన్నముద్దకృష్ణుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
తిరుపతి, 2023 నవంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నముద్దకృష్ణుని అలంకారంలో చిన్నశేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు రాజసంగా ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాహలం, భక్తుల కర్పూరహారతుల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీమతి శ్రీవాణి, ఏవిఎస్వో శ్రీ శైలేంద్రబాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.