SRI RAMACHANDRA SHINES ON CHINNA SESHA VAHANA _ చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం
చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం
తిరుపతి, 2022 మార్చి 31: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
Tirupati, 31 March 2022: On the second of the ongoing annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple in Tirupati on Thursday morning Sri Ramachandra rode Chinna Sesha vahana on the Mada streets and blessed devotees.
Legends say that Kundali is the powerhouse in form of a serpent and promotes the achievement of bliss.
Later the utsava idols of Sri Sita Lakshmana Sameta Sri Kodandarama swamy was offered Snapana Tirumanjanam.
Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswami of Tirumala, temple special grade Dyeo smt Parvati, AEO Durgaraju, Kankana bhattar Sri Ananda Kumar Dikshitu and devotees were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI