PLAN MULTI LEVEL CAR PARKING AT ALIPIRI- TTD EO _ అలిపిరిలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ కు ఏర్పాట్లు చేయండి : సీనియ‌ర్ అధికారుల స‌మీక్షలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 1 Mar. 21: To avoid the parking grievances of pilgrims, TTD EO Dr KS Jawahar Reddy directed the officials concerned to plan for a multi-level car parking facility at Alipiri.

During the Senior Officers’ review meeting held at the meeting hall of the TTD Administrative Building on Monday, the EO also instructed the officials to identify suitable 5-acre land for setting up a full fledged Children’s hospital in Tirupati.

He also urged officials to grow high yielding and tall flowering plants at all road junctions of Tirumala. The ongoing works at Alipiri walkers path should continue without causing inconvenience to the devotees trekking the way, he instructed. 

The EO directed the officials concerned to frame guidelines for conducting day-to-day activities at all TTD temples. The Dharma Prachara Ratham should also be geared to launch activities in rural areas on schedule time.

Later he instructed officials to install bio-metric attendance equipment and commence operations at all TTD educational institutions.

He also asked the SVBC MD to prepare an action plan of all spiritual programs for one full year besides digitisation of old CDs etc. and to increase the readability of Sapthagiri Magazine with articles penned by erudite pundits and writers.

TTD Additional EO and the SVBC MD Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, SVIMS Director Dr B Vengamma, FA and CAO Sri O Balaji, Chief Engineer Sri Ramesh Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి 5 ఎక‌రాల స్థ‌లం గుర్తించండి : సీనియ‌ర్ అధికారుల స‌మీక్షలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2021 మార్చి 01: తిరుప‌తిలో పూర్తిస్థాయిలో చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి అనువైన‌ 5 ఎక‌రాల స్థ‌లాన్ని గుర్తించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులకు పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా తిరుప‌తిలోని అలిపిరిలో, తిరుమ‌ల‌లోని అనువైన ప్రాంతంలో మ‌ల్టీలెవ‌ల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌నువిందు చేసేలా ముఖ్య కూడ‌ళ్ల‌లో ఎత్తుగా పెరిగే బంతి పూల మొక్క‌లు పెంచాల‌న్నారు. అలిపిరి న‌డ‌క‌మార్గంలో భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా పైక‌ప్పు నిర్మాణ ప‌నులు కొన‌సాగించాలని సూచించారు. టిటిడి ప‌రిధిలోకి తీసుకున్న ఆల‌యాల్లో రోజువారీ పాల‌నా వ్య‌వ‌హారాలు నిర్వ‌హించేందుకు స‌మ‌గ్ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధ‌ర్మ‌ప్ర‌చారం చేసేందుకు వీలుగా నిర్దేశిత వ్య‌వ‌ధిలో ధ‌ర్మ‌ప్ర‌చార ర‌థాలు సిద్ధం చేయాల‌ని సూచించారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో బ‌యోమెట్రిక్ అటెండెన్స్ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎస్వీబీసీలో  ఒక సంవ‌త్స‌ర కాలానికి అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌తో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ సిద్ధం చేయాల‌ని ఎండిని కోరారు. టిటిడిలోని పాత రికార్డుల‌ను డిజిటైజేష‌న్ చేయాల‌న్నారు. స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక పాఠ‌కాస‌క్తి పెంచేందుకు వీలుగా మంచి పండితులు, ర‌చ‌యిత‌ల‌తో వ్యాసాలు రాయించాల‌ని సూచించారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, స్విమ్స్ డైరెక్ట‌ర్‌ డాక్ట‌ర్ బి.వెంగ‌మ్మ‌, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.