BASELESS PROPAGANDA AGAINST CHILAKUR NALGONDA VEDIC SCHOOLS _ చిలుకూరు, నల్లగొండ వేద పాఠశాలలపై దుష్ప్రచారం – ఆ రెండు పాఠశాలలు మూసేయలేదు
Tirupati, 10 Mar. 21: Denying the false reports by a section of media over the closure of Chilakur and Nalgonda Veda Pathashalas, TTD clarified in view of the COVID pandemic, it has shifted 15 students from Chilakur Veda pathashala to Keesaragutta.
However, some vested interests spit venom via media that TTD has closed Chilakur and Nalgonda Vedic schools which is completely void of truth.
In United Andhra Pradesh, TTD has commenced Veda Pathashala in Chilakur of Rangareddy District in 2011. The then government decided to allocate 8acres of land to construct TTD Veda Pathashala at Chilakur. TTD has commenced Veda Pathashala in a Rotary Club, which is lying vacant after carrying out renovation works on a temporary basis.
TTD is waiting to construct a new Veda Pathshala at Chilkur if the state (TS) government comes forward and allocate 8 acres of land. The strength of this Vedic school is 15 since its inception. Though the strength has not increased, TTD has been running this school uninterruptedly from the past 11 years. TTD has sought the TS government to allocate 8acres of land in Chilakur many times.
The Veda pathashala at Nalgonda is also functioning in a smooth manner. But some vested interests are trying to malign the image of TTD by spreading false news. TTD is appealing to devotees and denizens of two Telugu states not to believe such baseless reports.
TTD is committed to construct Veda Pathashala at Chilakur if the government allots the land.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
చిలుకూరు, నల్లగొండ వేద పాఠశాలలపై దుష్ప్రచారం
– ఆ రెండు పాఠశాలలు మూసేయలేదు
– కోవిడ్ కారణంగానే చిలుకూరు పాఠశాల విద్యార్థులను తాత్కాలికంగా కీసరకు పంపాము
టీటీడీ స్పష్టీకరణ
తిరుపతి 10 మార్చి 2021: తెలంగాణ రాష్ట్రంలోని చిలుకూరు, నల్లగొండ వేద పాఠశాలలను మూసివేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామంలో 2011వ సంవత్సరం టీటీడీ వేద పాఠశాల నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఎకరాలు భూమిని ఇచ్చేందుకు నిర్ణయించింది.
– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టీటీడీ యాజమాన్యం చిలుకూరు గ్రామంలో ఖాళీగా ఉన్న రోటరీ క్లబ్ ను మరమ్మత్తులు చేసి తాత్కాలికంగా అక్కడ వేద పాఠశాలను ప్రారంభించింది.
– రాష్ట్ర ప్రభుత్వం 8 ఎకరాల భూమిని ఇస్తే పూర్తి స్థాయి భవనాలను నిర్మించి రోటరీ క్లబ్ లో నడుస్తున్న తాత్కాలిక వేద పాఠశాలను కొత్త భవనాల్లోకి తరలించేందుకు టీటీడీ సిద్ధంగా ఉంది.
– ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా 15 మంది విద్యార్థులతోనే వేద పాఠశాల నడుస్తూ వస్తోంది.
– విద్యార్థుల సంఖ్య పెరగకపోయినా కూడా టీటీడీ సుమారు 11 సంవత్సరాలుగా వేద పాఠశాల నిర్విఘ్నంగా నడుపుతోంది.
– 2011 సంవత్సరం తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలకులను, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ యాజమాన్యం వేద పాఠశాల నిర్మాణానికి ఇస్తామని చెప్పిన ఎనిమిది ఎకరాల భూమిని కేటాయించాలని ఇప్పటికే అనేక సార్లు కోరింది.
– గత సంవత్సరం కోవిడ్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల మూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి తాత్కాలికంగా కొన్ని రోజులపాటు ఈ 15 మంది విద్యార్థులను తెలంగాణలోని కీసర వేదపాఠశాలకు పంపించి తరగతులు బోధిస్తున్నాము.
– ఇది పూర్తిగా తాత్కాలికమే.
– తెలంగాణ ప్రభుత్వం 8 ఎకరాల భూమిని కేటాయిస్తే పూర్తిస్థాయి వేదపాఠశాల నిర్మించేందుకు టీటీడీ సుముఖంగా ఉంది.
– చిలుకూరు వేద పాఠశాలను కీసర ప్రాంతానికి తరలించినట్లు టీటీడీ ఎప్పుడూ ప్రకటించలేదు.
– కొందరు స్వార్ధపరులు టీటీడీ యాజమాన్యం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
– నల్గొండలో టిటిడి నడుపుతున్న వేద పాఠశాలను కూడా మూసేశారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
– నల్లగొండలోని వేదపాఠశాల తరగతులు జరుగుతూనే ఉన్నాయి.
– ఇక మీదట కూడా ఏ ఆటంకమూ లేకుండా టీటీడీ యాజమాన్యం తరగతులను పూర్తిస్థాయిలో నడుపుతూనే ఉంటుంది.
– కొందరు దురుద్దేశ పూరితంగా టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారు.
– శ్రీవారి భక్తులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ అసత్య ప్రచారాలు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.