FOUNDATION STONE LAID FOR SRI PADMAVATHI AMMAVARU TEMPLE AT CHENNAI _ చెన్నైలో శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన

– GUDIKO GOMAATHA CAMPAIGN COMMENCES AT TAMIL NADU

– GODDESS PADMAVATHI TO BESTOW PROSPERITY IN THE COUNTRY SAYS KANCHI PONTIFF

 Tirumala, 13 Feb. 21: The foundation stone was laid ceremoniously for the construction of Goddess Sri Padmavati Ammavaru temple at GN Chettiyar street of T.Nagar in Chennai on Saturday morning.

The Kanchi Pontiff Sri Sri Sri Vijayendra Saraswati Swamy Shankaracharya performed the auspicious ritual amidst Mangala Vaidyam and Vedic mantras by Archakas and pundits.

The temple was built in the 34 cents (6 grounds) land worth ₹40 crore donated to TTD by yesteryear film actress Ms Kanchana, Smt Girija Pandey, Sri KP Pandey and Sri Ravibhushana Sharma of Chennai.

Earlier, as part of the event Vishwaksena Aradhana and Ankurarpanam were performed on February 10 and Panchasukta hHomam was conducted on February 11 and 12.

On Saturday morning the Kanchi Seer Performed the sacred Shankusthapana which included Purnahuti and installation of foundation pylon at the site.

GUDIKO GOMAATA LAUNCHED

Earlier the Kanchi pontiff also launched the TTD’s prestigious program of Gudiko-Gomata campaign in Tamilnadu wherein 8 pairs of cows and calves with new clothes and Harati were donated to 8 temples in the state of Tamilnadu.

Speaking on the occasion the Kanchi Pontiff in his Anugraha Bhashanam sought blessings of Goddess Padmavati to eradicate poverty across the country and bestow prosperity on all.

He said the TTD has successfully taken up the Gudiko-Gomata campaign as part of its agenda for the propagation of Sanatana Hindu Dharma.

TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Special Invitees of TTD board and TTD local advisory committee president Sri Sekhar Reddy and MP Sri Vemireddy Prabhakar Reddy, TTD board members Smt Vemireddy Prashanti, Dr M Nishita, Sri Kumaraguru and Sri Govind Hari were present.

Temple Land donors, TTD CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, SEs Sri Satyanarayana, Sri Venkateswarlu and members of local advisory committee were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చెన్నైలో శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన

–  తమిళనాడు లో గుడికో గోమాత ప్రారంభం
–  పద్మావతి అమ్మవారు దేశంలో పేదరికం పొగొట్టాలి : కంచి పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి

తిరుమల, 13  ఫిబ్రవరి 2021: చెన్నై మహానగరం లోని జి ఎన్ చెట్టి స్ట్రీట్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం ఉదయం శాస్త్రోక్తంగా శంఖుస్థాపన నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్తోచ్చారణ మధ్య కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
       
టి. నగర్ లోని జి ఎన్ చెట్టి వీధిలో  సినీనటి కుమారి కాంచన, శ్రీమతి వి గిరిజా పాండే, శ్రీ కెపి పాండే, శ్రీ.పి.రవిభూషణ శర్మ రూ. 40 కోట్ల విలువ చేసే  34 సెంట్ల ( 6 గ్రౌండ్లు) భూమి టీటీడీకి దానంగా ఇచ్చారు. దాతల కోరిక మేరకు టీటీడీ ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా ఈ నెల 10 వ తేదీ విశ్వక్షేనారాధన, అంకురార్పణ నిర్వహించారు. 11, 12వ తేదీల్లో పంచసూక్త హోమం జరిపారు. శనివారం ఉదయం శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ నిర్మాణానికి  వేద మంత్రాల నడుమ నవధాన్యాలు వేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం పంచసూక్త హోమం పూర్ణాహుతిలో పాల్గొని, ఆలయ శంఖుస్థాపనకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు.
       
అంతకుముందు  కంచి పీఠాధిపతి ఇదే ప్రాంగణంలో  టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని తమిళనాడులో ప్రారంభించారు.  8 గోవులు, 8 దూడలకు పూజలు చేసి, నూతన వస్త్ర ధారణ, హారతులు ఇచ్చి తమిళనాడు లోని 8 ఆలయాలకు గోవు, దూడలను అందించారు.
       
టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి దంపతులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, శ్రీ కుమారగురు, శ్రీ గోవిందహరి, భూమి దాతలు కుమారి కాంచన శ్రీమతి వి.గిరిజా పాండే, శ్రీ కె పి పాండే ,శ్రీ. టీటీడీ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు తో పాటు స్థానిక సలహామండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పేదరిక నిర్మూలన జరిగి, దేశానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి :  శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
       
అమ్మవారి కృపతో దేశంలో పేదరికం తొలగిపోయి,అందరికీ ఉపాధి లభించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని ప్రార్థించారు.  అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భూదానం, గోదానం, స్వర్ణ దానం వల్ల ఏడు జన్మల పుణ్యం లభిస్తుందన్నారు. చెన్నై మహానగరంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ద్వారా హిందూ ధర్మ ప్రచారం మరింతగా విస్తరిస్తుందని స్వామి చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం బాగా జరుగుతోందని, గుడికో గోమాత లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది