V-DAY PRELIMINARY MEETING HELD _ జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు: అడిషనల్ ఈవో
VAIKUNTHA DWARA DARSHAN FROM JAN 10-19 IN 2025
ARJITA SEVAS, VIP BREAK, PRIVILEGE DARSHAN REMAINS CANCELED
TIRUMALA, 25 NOVEMBER 2024: A preliminary review meeting in connection with the Vaikuntha Ekadasi Vaikuntha Dwara Darshanam was held by the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary.
The meeting took place at Annamaiah Bhavan in Tirumala on Monday noon with HoDs of various departments.
As the Vaikuntha Ekadasi is scheduled on January 10 next, the Vaikuntha Dwara Darshanam will be provided to the devotees by TTD from January 10 till 19 for 10 days.
The Additional EO has instructed all the officials of the respective departments to make preparations as only forty-odd days are left for the mega-religious event.
He said, the management is keen on providing priority to common pilgrims to have Vaikuntha Dwara Darshanam during these ten days.
Another review meeting will be held in a couple of weeks finalizing on the quota of tickets to be issued and other amendments to be made ensuring more darshan hours to common pilgrims during the ten day Vaikuntha Dwara Darshanam.
He also discussed on the flower decorations to me made matching the event, accommodation, srivari sevaks and scouts to be deployed, traffic management, sanitation and others.
Some highlights :
VIP Break darshans(except for protocol VIPs) remains cancelled during these ten days.
TTD has also cancelled privilege darshans such as parents with infants, Senior Citizens, physically challenged, Defence, NRI, etc., for 10 days from 10/01/2025 to 19/01/2025.
Arjita Sevas also remains cancelled from Jan 09 to 19
SVBC to live telecast Swarna Radham Procession on 10/01/2025 and Chakra Snanam on 11/01/2025.
Annaprasadam at MTVAC to be distributed from 6AM to 12 Midnight for all 10 days.
CVSO Sri Sridhar, CE Sri Satyanarayana and other senior officers of various departments were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు: అడిషనల్ ఈవో
తిరుమల, 2024 నవంబరు 25: తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.
వచ్చే జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండటంతో జనవరి 10 నుంచి 19వ తేది వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుంది. ఇందుకు నలభై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ అడిషనల్ ఈఓ ఆదేశించారు.
ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
• ఈ పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) రద్దు.
• జనవరి 10 నుండి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.
• జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు
• జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న చక్ర స్నానం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
• మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.
ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీ శ్రీధర్, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.