జనవరి 15న రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్‌ సదస్సు

జనవరి 15న రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్‌ సదస్సు

తిరుపతి, జనవరి 10, 2013: తితిదే ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జనవరి 15వ తేదీన రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్‌ సదస్సు నిర్వహించనున్నారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానం ఈ సదస్సుకు వేదిక కానుంది.
 
సదస్సులో భాగంగా ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నాలుగు వేదాల్లోని ఐదు శాఖల వేదమంత్రాలను వేదపండితులు పఠిస్తారు. ఇందులో ఒక్కో శాఖలోని వేదమంత్రాల వైశిష్ట్యాన్ని పండితులు తెలియజేస్తారు.
 
సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు ”షట్‌ శాస్త్రాలు”పై ఉపన్యాస కార్యక్రమాలుంటాయి. అనంతరం ఉద్దండులైన 18 మంది వేదపండితులను తితిదే సత్కరించనుంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.