SRIVARI PARVETA UTSAVAM ON JAN 16 _ జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం 

Tirumala, 14 Jan. 20: TTD is making all-out arrangements to celebrate Srivari Parveta utsavam on January 16, on an immediate day to Sankranthi festival.

On the same day, Sri Goda Parinayotsavam will be observed and the garlands of Sri Andal Ammavaru will be taken out on Thursday morning in a procession from Sri Sri Sri Pedda Jeeyar Mutt to Srivari temple.

Later in the afternoon utsava idols of Sri Malayappaswamy and Sri Krishna are brought to Parveta mandapam for paruveta utsavam and mock hunting festival is performed.

ARJITA SEVAS CANCELLED

In view of the festival programs on January 16, the TTD has cancelled all arjita sevas like Tiruppavada, Kalyanotsavam, and unjal Seva Brahmotsavams, Vasantotsavam and Sahasra deepalankara seva.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం 
 
తిరుమల, 2020 జనవరి 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున  కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
       
గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.
 
ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.
 
ఆర్జితసేవలు రద్దు :
 
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావ‌డ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.