జనవరి 16వ తేదీన ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం’
జనవరి 16వ తేదీన ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం’
జనవరి 13, తిరుపతి 2019: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ బుధవారం సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8 నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. 11.45 గంటల నుండి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
గోపూజ మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి క పకు పాత్రులు కావాలని కోరడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.