KOIL ALWAR TIRUMANJANAM AT TIRUCHANOOR ON JAN 20 _ జనవరి 20 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 16 January 2026: Koil Alwar Tirumanjanam will be performed in a grand manner at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on January 20. In connection with the annual Rathasapthami festival scheduled to be held on January 25, it is customary to conduct Koil Alwar Tirumanjanam in the temple.
As part of this ritual, the Goddess will be awakened with Suprabhata Seva in the early morning. Koil Alwar Tirumanjanam will be observed from 6.30 a.m. to 9.00 a.m. During this ritual, the temple premises including walls, roofs, pooja articles and other items will be thoroughly cleansed with water.
Sacred water mixed with aromatic substances such as namakopu, srichurnam, kasturi turmeric, pachaku, edible camphor, sandalwood powder, kumkum and kichiligadda will be sprinkled throughout the temple as part of the purification process.
Devotees will be allowed for the darshan of the Goddess from 9.30 a.m. onwards.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి 20 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2026 జనవరి 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
