RATHASAPTHAMI AT TIRUCHANOOR ON JANUARY 25 _ జనవరి 25న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

– KOIL ALWAR TIRUMANJANAM ON JANUARY 20

Tirupati, 05 January  2026: On the auspicious occasion of Surya Jayanti, Rathasapthami will be observed at Tiruchanoor wherein Sri Padmavati Devi will bless Her devotees, parading on Seven major vahanams on January 25.

As per the schedule, on Sunday, January 25, the Goddess will give darshan to devotees on

Surya Prabha Vahanam between 7am and 8am

Hamsa Vahanam : 8.30 am to 9.30 am

Ashwa Vahanam: 10am-11am

Garuda Vahanam : 11.30 am – 12.30 pm

In the afternoon, the Goddess will bless devotees on:

Chinna Sesha Vahanam 1pm – 2pm

Chandra Prabha Vahanam 6 pm – 7 pm

Gaja Vahanam: 8.30 pm – 9.30 pm

Meanwhile, Snapana Tirumanjanam to the Utsava Murties of Sri Padmavathi Ammavaru will be performed in a grand manner at the Sri Krishnaswamy Mukha Mandapam in the temple between 3.30 pm and 4.30 pm.

In view of the Rathasapthami celebrations, TTD has cancelled Kalyanotsavam, Kumkumarchana, Break Darshan, Unjala Seva, and Vedasirvachanam at Sri Padmavathi Ammavari Temple on January 25.

Similarly, at the sub-temple of Sri Surya Narayana Swamy, the processional deity of Sri Surya Narayana will bless devotees on Aswa Vahanam between 6am and 7am.

Koil Alwar Tirumanjanam on January 20

In connection with the Rathasapthami festival, Koil Alwar Tirumanjanam will be conducted at the Sri Padmavathi Ammavari Temple on January 20 from 6.30 am to 9 am. 

After the Tirumanjanam, devotees will be allowed Sarva Darshan of Sri Padmavathi Ammavaru. On this occasion, Kalyanotsavam Seva remains cancelled.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి 25 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

జ‌న‌వరి 20 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2026, జనవరి 05: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి  భక్తులను అనుగ్రహించనున్నారు.

జనవరి 25 ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.

కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌ సేవ, వేదాశీర్వచనంలను టీటీడీ రద్దు చేసింది.

అదేవిధంగా, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జ‌న‌వరి 20 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వరి 20వ తేదీ ఆలయంలో ఉదయం 6.30 గం.ల నుండి 9.00 గం.ల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సర్వదర్శనం భక్తులు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం సేవను రద్దు చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.