KOIL ALWAR ON JAN 28 _ జ‌న‌వ‌రి 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 23 JANUARY 2025: The religious temple cleaning ritual of Koil Alwar Tirumanjanam will be observed on January 28 in Tiruchanoor.

The entire temple, sub temples and puja utensils are cleansed with Parimalam mixture from 6:30am till 9:30am on that day.

The temple authorities have cancelled Kalyanotsavam, Sahasra Deepalankara Sevas on that day.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జ‌న‌వ‌రి 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025 జ‌న‌వ‌రి 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జ‌న‌వ‌రి 28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ రథసప్తమి వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఈ కార‌ణంగా జ‌న‌వ‌రి 28న‌ క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.