ASHOTTARA SHATAKALABHISHEKAM AT SRI KODANDARAMA SWAMY TEMPLE ON JAN 3 _ జనవరి 3న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
Tirupati, 02 January 2026: The Ashtottara Shatakalabhishekam will be performed at the Sri Kodandaramaswamy temple in Tirupati on January 3 at 9 AM in the temple.
Devotees can participate in this seva by paying Rs. 50/- each.
Kalyanotsavam on January 4th
The Kalyanotsavam (celestial wedding) of the deities will be performed at the Sri Kodandaramaswamy temple on January at 11:00 AM in the temple coinciding the Punarvasu Nakshatra. Married couples can participate in the Kalyanotsavam by purchasing a ticket for Rs. 500/-. Traditional dress code is mandatory.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి 3న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2026 జనవరి 02: తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో జనవరి 3వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
జనవరి 4న కల్యాణోత్సవం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 4వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
