జనవరి 3న శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలలో పౌర్ణమి గరుడ సేవ
జనవరి 3న శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలలో పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2026 జనవరి 02: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలలో జనవరి 3న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ గోవిందరాజస్వామి, గరుడునిపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీనివాసమంగాపురంలో….
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
