TTD CHAIRMAN OFFERS PATTU VASTRAMS TO JAPALI HANUMAN _ జాపాలి హనుమాన్ కు టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పణ
Tirumala, 22 May 2025: On the auspicious occasion of Hanuman Jayanti, TTD Chairman Sri B.R. Naidu on Thursday offered Pattu Vastrams on behalf of TTD to the famous Japali Anjaneya Swamy at Japali Theertham in Tirumala.
Upon his arrival at the temple, the Chairman was welcomed by the priests, who facilitated him darshan of Japali Hanuman.
After performing special pujas to the deity, the priests honoured the Chairman with Sindhoora vastram and offered Theertha Prasadams.
Speaking to the media on this occasion, the TTD Board Chief said that offering Pattu Vastrams to Japali Hanuman on Hanuman Jayanti is a long-standing tradition.
He said he prayed Sri Japali Hanuman to bestow His blessings upon all the devotees.
VGO Sri Surendra, Health Officer Dr. Madhusudan, and other officials participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జాపాలి హనుమాన్ కు టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పణ
తిరుమల, 2025 మే 22: హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరుపున చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేకం పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో చైర్మన్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ హనుమజ్జయంతి రోజున జాపాలి హనుమాన్ కు టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర, ఆరోగ్యాధికారి శ్రీ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.