APPLICATIONS INVITED FOR SETTING UP DISTRICT HDPP COMMITTEES _ జిల్లా ధర్మప్రచార మండళ్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం
Tirupati, 5 Feb. 21: TTD has invited applications from interested persons to set up HDPP Committees in all districts of AP and old districts of Telangana State.
The applicants aged between 30-60 years with service orientation, faith in Hindu traditions, interest in Dharmic propagation, ready to work without any honorariums and to enhance the prestige of TTD image, alone shall apply.
TTD aims to form HDPP committees with 10 members in each district. They could obtain applications, all details and terms of service etc. from the TTD website www.tirumala.org
All completed applications should be sent to – “The Secretary, Hindu Dharma Prachara Parishad, SVETA Bhavan, opposite to SV University, Tirupati-517502 on or before February 15.
They should also write on the cover “Applications for District HDPP committees“.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జిల్లా ధర్మప్రచార మండళ్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, 2021 ఫిబ్రవరి 05: అంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, తెలంగాణలోని పాత జిల్లాల్లో ధర్మప్రచార మండళ్ల ఏర్పాటుకు ఆసక్తి గలవారి నుండి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎలాంటి పారితోషికం ఆశించకుండా, నిస్వార్థ ధర్మబుద్ధితో టిటిడి ప్రతిష్టను ఇనుమడించేరీతిలో సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. 30 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు వయసు, సంప్రదాయాల పట్ల విశ్వాసం, సేవాదృక్ఫథం కలిగి ధర్మప్రచార నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేయగల ఆలోచనాపరులై ఉండాలి. ప్రతి జిల్లాకు 10 మంది సభ్యులు ఉంటారు. దరఖాస్తు, పూర్తి వివరాలు, నియమావళి టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org నుండి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తును “కార్యదర్శి, హిందూ ధర్మప్రచార పరిషత్తు, శ్వేత భవనం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎదురుగా, తిరుపతి – 517502” అనే చిరునామాకు ఫిబ్రవరి 15వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపే కవరుపై “(జిల్లా పేరు) ధర్మప్రచార మండలికై దరఖాస్తు” అని రాయాలి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.