జీవుడే శివుడు, శివుడే జీవుడు – ఆచార్య మృత్యుంజయశర్మ

జీవుడే శివుడు, శివుడే జీవుడు – ఆచార్య మృత్యుంజయశర్మ

 తిరుపతి, 2010 మార్చి 05: ఈ కార్యక్రమానికి శ్రీ శలాక రఘునాధశర్మ గారు అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీ వి.గోపాలకృష్ణమాచార్యులు పారమాత్మికోపనిషత్‌ శరణాగతితత్త్వం గురించి వివరించారు. విఖనసుడు పారమాత్మిక అనే రెండు విషయాలు ప్రస్పుట మౌతాయి.

మృత్యుంజయశర్మ గారు:-

వేదములలో శివతత్మము – అన్న అంశముపై పత్రము సమర్పిస్తూ
– వేదశ్శివో శివో వేదః (ఇతి) అని
– తత్వం – ప్రళలమానతరం కూడా ఏదైతే ఉంటుందో అదే తత్వము
– శివశబ్దము – ఋగ్వేదాలలో ఏలా చెప్పబడినవి. ఋగ్వేదం మొదటిది కావున రుద్రము ప్రథమం
– రుద్రం గురించి చెప్పబడినదే రుద్రతత్వం.
– రుద్రుడు – సర్వజన హృదయవాసుడు ఇత్యాదిని (చిత్తశుద్దిని కలుగజేయువాడు, ప్రాణదాత)
– ఉపమా సహితః సోమః అని సోమశబ్ధం
– అథర్వవేదం- పశుపతి, పేర్లతో
– ఏకదేవోకరాధనలే ఉపనిషత్తులు.
– శ్వేతాస్వరోపనిషత్తులో శివుని వైశిష్ఠ్యం చెప్పబడినది. (విశ్వాధిపతి, సర్వభూతములకు అధిపతి)
– గాయత్రీమంత్రంలోని భర్గ శబ్ధము శివ స్వరూపమని
– ”శివాధన్యః కించన” అని వరాహోపనిషత్తు.
– జీవుడే శివుడు, శివుడే జీవుడు అని కఠోపనిషత్తు

ఎం.ఎల్‌.ఎన్‌. శాస్త్రిగారు:-

శశృతులలో సంస్కార వైశిష్యం అన్న అంశముపై విమర్శన పూర్వకంగా పత్రం సమర్పించారు.
అందులో
– 48 సంస్కారాలు, వాటిలో 15 సంస్కారాలు ప్రముఖమైనది.
– జాతకర్మ అన్న ప్రాసన, చూడ కర్మల విషయం ధర్మసంధాలో చెప్పబడింది స్పష్టంగా
– ”గర్భాదష్టమే వర్షే ఉపనయానం ”కుర్వాత్‌”
– ఉపనయనమితి కర్మ సంస్కారం, ఆచార్యుని దగ్గరకు తీసుకుపోవుటకు చేసే కర్మయే ఉపనయనం.
– ఉపయన సంస్కారంతో బ్రహ్మచర్యత్వం పొంది వేదాన్ని అభ్యసిస్తారు.

యడవల్లి శ్రీనివాస శర్మ :

వేదపరిరక్షణలో లిపులు వాటి ప్రాధాన్యత గురించి శోధ పత్రాన్ని సమర్పించారు.
– బ్రహ్మలిపి ప్రథమమైనది.
– కుడి నుండి ఎడమవైపు రాయు లిపులు – భారతీయ భాషలు అన్నియు
– ఎడమ నుండి కుడివైపు రాయు లిపులని రెండు రకాల అరేబియా, పర్షీయన్‌, ఉర్దూ వంటివి.
– ప్రస్తుతం మనకు కొన్ని లిపులే లభిస్తున్నాయి. చాలా లిపులు లుప్తమైనది.
– తాళపత్రాలయందు వివిధ లిపులతో రాయబడిన గ్రంధములు ఉన్నవి.

ఈ అంతర్జాతీయ సమ్మేళనంలో వేద విద్యార్థులు పర్చి కూర్చినట్టి వేదవిజ్ఞాన ప్రదర్శనశాల సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.