TALLAPAKA TEMPLE ANNUAL FETE _ జులై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 03 JULY 2024: The annual Brahmotsavams of Sri Siddheswara Swamy temple in Tallapaka of Annamaiah district are scheduled from July 17 to 25 with Ankurarpanam on July 16.

Important days includes Nandi Vahanam on July 21, Arjita Kalyanotsavam (Rs. 300/-per ticket on which two are allowed)on July 22, Trisula Snanam on July 25.

Pushpayagam will be observed on July 26.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జులై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 జులై 03: తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.

జులై 17న ఉదయం 6.28 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం హంసవాహన సేవ నిర్వహిస్తారు. జులై 18, 19, 20, 21వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా జులై 18న సాయంత్రం చంద్రప్రభ వాహనం, 19న‌ సాయంత్రం చిన్నశేష వాహనం, 20న సాయంత్రం సింహ వాహనం, 21న సాయంత్రం నంది వాహ‌న‌సేవ జ‌రుగుతాయి. జులై 22న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

జులై 23న సాయంత్రం పల్లకీ సేవ, 24న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 25న ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

జులై 26వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.