LAST PHASE OF AKHANDA SUNDARAKANDA PATHANAM ON JULY 24 _ జులై 24న 16వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 14 JULY 2021: The last phase of Akhanda Sundarakanda Pathanam will be organized by TTD at Nada Neerajanam platform in Tirumala on July 24.

To enrich the cultural, moral, social, religious and philosophical thoughts of the people particularly among the youth and also seeking divine intervention to get over the Covid Pandemic, TTD has commenced Sundarakanda Pathanam on June 11 in 2020. 

Every day this programme is being telecasted live on SVBC between 7am and 8am. According to Beejaksharas, the Akhanda Sundarakanda Pathanam covering all 2821 Shlokas from 68 chapters needed to be carried out 16 times. TTD has successfully completed 15 Akhanda Sundarakanda Pathanams and the final 16th one will take place next Saturday on the auspicious day of Guru Poornima.

This spiritual programme has been receiving accolades from all corners across the globe. The16th Akhanda Sundarakanda Pathanam will cover 229 Shlokas from 65 to 68 Sargas and also covers Sri Rama Pattabhishekam episode. This event takes place at 7am on that day and will be telecasted live on SVBC for global devotees.

The devotees are requested to participate in the Akanda Pathanam watching live on TV sets sitting right at their houses and enjoy the divine bliss.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులై 24న 16వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2021 జులై 14: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జులై 24వ తేదీ శ‌నివారం 16వ విడ‌త‌ సుందరకాండ  అఖండ పారాయణం జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 65 నుండి 68వ సర్గ వరకు 4 సర్గల్లో గ‌ల 229 శ్లోకాలను, శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేక ఘ‌ట్టాన్ని పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులు ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. కాగా, సుంద‌ర‌కాండ‌లో మొత్తం 68 స‌ర్గ‌ల్లో 2,821 శ్లోకాలు ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంతో మొత్తం శ్లోకాల పారాయ‌ణం పూర్త‌వుతుంది.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 7 గంట‌ల నుండి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.