జూన్‌ 12వ తేదిన ఆంధ్రజ్యోతి పత్రికలో పద్దుల్లేవ్‌ హద్దులేవ్‌! అదే విధంగా స్వామీ ఇది ఏమి? అనే శీర్షికలతో ప్రచురించిన కథనాలు వాస్తవం కాదు.

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
             
                                                    వివరణ

            జూన్‌ 12వ తేదిన ఆంధ్రజ్యోతి పత్రికలో పద్దుల్లేవ్‌ హద్దులేవ్‌! అదే విధంగా స్వామీ ఇది ఏమి? అనే శీర్షికలతో ప్రచురించిన కథనాలు వాస్తవం కాదు.

            తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిరోజు లోక కళ్యాణం కొరకు ఆ దేవదేవుని కళ్యాణం జరుగుతుంది. ఈ నిత్య కల్యాణ కార్యక్రమం ప్రపంచానికి, తిలకించిన భక్తులందరికీ శుభం జరుగుతుందని ప్రజలందరి అభిప్రాయం. కాని వెయ్యిమంది భక్తుల కంటే ఎక్కున మంది ఈ కల్యాణాన్ని తిలకించడానికి వీలులేదు. ఎంతో శుభప్రదమైన శ్రీవారి కల్యాణాన్ని తమ,తమ ప్రాంతాలలో జరిపించాలనీ, అందుకవసరమైన మౌళిక సదుపాయాలు తామే యేర్పాటు చేస్తామని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు, ప్రఖ్యాతి చెందిన ధార్మిక సంస్థలు, సంఘాలు దేవస్థానాన్ని కోరుచున్నాయి. భక్తుల అభ్యర్తన మేరకు యిప్పటికే దేశంలో అనేక ప్రధాన నగరాలలో శ్రీనివాసకళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. లక్షలాదిమంది భక్తులు శ్రీనివాసకల్యాణం తిలకించడం ద్వారా తమ జీవితాలు ధన్యమయ్యాయని తెలియజేశారు.

            ఈ కార్యక్రమాలకు అవసరమైన అనేక మౌళిక యేర్పాట్లకు వివిధ సంస్థలు తమంతటతామే నిర్వహించాయి. వీటికి సంబంధించి దేవస్థానం ఎలాంటి ”డొనేషన్లు” స్వీకరించడం జరుగలేదు.

           ఈ కార్యక్రమంలో డిల్లీలో జరిగిన కల్యాణోత్సవానికి సలీల్‌ఖాన్‌ బృందం ఏర్పాట్లు చేయగా గురుగావ్‌ నందున ఇఫ్‌కో సంస్థ, ఆంధ్ర అసోసియేషన్‌, శాస్త్ర యూనివర్సిటీవారు, మధురైలో జరిగిన కల్యాణోత్సవం మూకాంబిగ ట్రస్టు. తిరుచ్చిరాపల్లెలో జరిగిన కల్యాణోత్సవానికి శ్రీరంగ సేవాట్రస్టు, చెనైలో జరిగిన కల్యాణోత్సవానికి స్థానిక సలహా కమిటీవారు ఏర్పాట్లు చేశారు. ఈ స్వచ్ఛంద సంస్థలు, బృందాలు, కమిటీలకు చెందిన వారంతా స్వామిపై ఉన్న భక్తితో తి.తి.దే., చేస్తున్న మంచి కార్యాన్ని జయప్రదం చేయటానికి వారంతట వారే ఏర్పాట్లు చేయడానికి ముందుకు వచ్చారే తప్ప వారిని ఏవిధంగాను నొప్పించడం జరుగలేదు, అయితే సదరు వార్తనందు బ్యాంకులవారు ”వణుకుతున్నారని” వ్రాయడం కూడా సరికాదు.

          అదే విధంగా తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పనిచేసే అనేక భ్యాంకులు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తదితర సందర్భాలలో అవసరమైన కొన్ని ఏర్పాట్లను తమంతటతామే నిర్వహిస్తుంటాయి. ఇటీవల శ్రీతాళ్ళపాక అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలలో బ్యాంకులు కూడా పాల్గొనాలని, కొన్ని ప్రచార కార్యక్రమాలు వారంతకు వారే నిర్వహించాలని కోరడం జరిగింది. ఇదే క్రమంలో రాజంపేటలో జరిగిన అన్నమయ్య 600 జయంతి  ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో సదరు బ్యాంకు అధికారులను నొప్పించడం జరిగిందని పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. తి.తి.దే., ఇటువంటి ఉత్సవాలు నిర్వహించినప్పుడు వివిధ సంస్థలు సంఘాల నుండి సహకారాన్ని స్వీకరించడమే తప్ప వారిని బలవంతం చేసే ఆలోచన, అవసరం తి.తి.దే., కు వుండదు.

        ది ఆర్స్‌ ఆఫ్‌ లివింగ్‌కు చెందిన శ్రీపండిట్‌ రవిశంకర్‌గారిని తిరుమలలో జరిగిన సదస్సుకు మిగతా మఠాధిపతులు, పీఠాధిపతులువలే ఆహ్వానించాము. అయితే వారు హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి,తి.తి.దేవస్థానానికి ఏవిధంగా సంబంధంలేదు.. అవాస్తవాలను వాస్తవాలుగా వ్రాయడం సరికాదు.

         తి.తి.దేవస్థానంలో ఆదాయం, ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి కేంద్రసర్వీసుల నుండి ఒక సీనియర్‌ అధికారి ఆర్థిక సలహాదారు మరియు ముఖ్యగణాంకాధికారిగా పనిచేస్తున్నారు. అంతే కాకుండా ఆడిటింగ్‌ దేవస్థానంలో నిరంతరం కొనసాగుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం, ”వీటికి హద్దులు, పద్దులు లేవు” అని పేర్కొనడాన్ని ఖండిస్తునాం.

        లోక కల్యాణానికి, ప్రజాహితానికి చేపట్టిన తి.తి.దే., కల్యాణమస్తు దళితగోవిందం, అన్నమయ్య జయంతి ఉత్సవాలకు తదితర కార్యక్రమాలకు లక్షలాదిమంది భక్తులనుండి మంచి స్పందన లభించింది.

         తి.తి.దే., చేస్తున్న ఈ బృహత్తరకృషికి ఎన్నో సంస్థలు, సంఘాలనుండి సహకారం లభిస్తున్నది.

          అవాస్తవాలను వాస్తవాలుగా, చిత్రీకరిస్తూ భక్తుల మనోభావాలను నొప్పించడం సరికాదని తెలియజేస్తున్నాం.

         ఈ వివరణను మీ దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని కోరుచున్నాము.


ప్రజాసంబంధాల అధికారి,
తి.తి.దేవస్థానములు,
తిరుపతి.
—————————–


To.
Journlists Association of Devotional Magazines
D.No.1-1-365/A, Jawahar Nagar,
RTC ‘X’ Roads, Hyderabad-20.

విషయం – సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం సమాచారం కోసం మీరు పెట్టుకున్న అర్జీగురించి.

*******

        తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు, మరియు అన్ని  ఉత్సవాలు, టెండర్లు మొదలగు పత్రికా ప్రకటనా కార్యక్రమాలు తప్ప వేరు ఏ విధంగాను మాకు ప్రత్యేకమైన బడ్జెట్టు కేటాయింపులు లేవు,


ప్రజాసంబంధాల అధికారి,
తి.తి.దేవస్థానములు,
తిరుపతి.