DETAILS OF RELEASE OF JUNE DARSHAN QUOTA _ జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

Tirumala, 16 March 2026: The quota details for various darshans and accommodation for June 2026 to be released by Tirumala Tirupati Devasthanams are as follows.

The tickets for Srivari Arjita Sevas (Suprabhatam, Thomala, Archana and Ashtadala Pada Padmaradhana) will be released online at 10 AM on March 18.

Devotees can register online for the electronic dip for these seva tickets till 10 AM on March 20.

Those who are allotted tickets in the electronic dip should make the payment between March 20 and March 22 before 12 noon, after which the tickets will be confirmed.

Arjita Seva Tickets Release on March 21

The tickets for Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Seva and Jyeshtabhishekam will be released online at 10 AM on March 21.

Release of Virtual Seva Quota

The quota for Virtual Sevas and their darshan slots will be released online at 3 PM on March 21.

Angapradakshinam Tokens Release on March 23

The Angapradakshinam tokens will be released online at 10 AM on March 23.

Srivani Trust Darshan Quota

The quota for Srivani Trust darshan tickets will be released online at 11 AM on March 23.

Darshan Quota for Senior Citizens and Differently-Abled

The quota of free special darshan tokens for senior citizens, differently-abled persons and devotees with chronic illnesses will be released online at 3 PM on March 23.

Special Entry Darshan Tickets on March 24

The Special Entry Darshan tickets will be released online at 10 AM on March 24.

Release of Accommodation Quota

The accommodation quota for Tirumala and Tirupati will be released online at 3 PM on March 24.

Devotees are requested to book Srivari Arjita Sevas and darshan tickets through the official website:

https://ttdevasthanams.ap.gov.in

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల, 2026 మార్చి 16: 2026 జూన్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21 ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23 అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.