జూన్ 10 నుండి జూలై 5వ తేది వరకు అనంతపురం జిల్లాలో రెండవ విడత లోకకళ్యాణ రథయాత్ర
జూన్ 10 నుండి జూలై 5వ తేది వరకు అనంతపురం జిల్లాలో రెండవ విడత లోకకళ్యాణ రథయాత్ర
తిరుపతి, 2010 జూన్ 05: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత లోకకళ్యాణ రథయాత్ర జూన్ నెల 10వ తేది నుండి జూలై 5వ తేది వరకు అనంతపురం జిల్లాలో నిర్వహిస్తారు.
ఈ లోకకళ్యాణ రథయాత్ర జూన్ 10వ తేది నుండి 16వ తేది వరకు అనంతపురం మండల పరిధిలోని సింగనమల, జూన్ 19వ తేది నుండి 25వ తేది వరకు ధర్మవరం మండల పరిధిలోని బత్తలపల్లి, జూన్ 28వ తేది నుండి జూలై 4వ తేది వరకు పెనుగొండ మండల పరిధిలోని చిలమత్తూరు తదితర ప్రాంతాలలో జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.