జూన్‌ 13న శ్వేతలో ‘సామాన్యులకు వేద విజ్ఞానం’పై సదస్సు

జూన్‌ 13న శ్వేతలో ‘సామాన్యులకు వేద విజ్ఞానం’పై సదస్సు

తిరుపతి, జూన్‌ 12, 2013: తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం ఉదయం 10.00 గంటలకు ‘సామాన్యులకు వేద విజ్ఞానం’ అనే అంశంపై సదస్సు జరుగనుంది. హైదరాబాదులోని ఐ-సర్వ్‌ విజ్ఞానసంస్థకు చెందిన శ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించనున్నారు. తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సుకు శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ, ఇతర అధికారులు హాజరుకానున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.